పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ(OG)’ సినిమాలో పవన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గరి నుంచి వరుస అప్టేడ్స్ వస్తూ సినిమాపై భారీ హైప్ తీసుకువస్తోంది మూవీ యూనిట్. తాజాగా మరో అప్‌డేట్‌తో.. మేకర్స్ ముందుకొచ్చారు. ఇప్పటి వరకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో పూర్తిచేసిన యూనిట్ సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ వచ్చేసింది. దీంతో నేటి నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలియజేసింది.
Pawan Kalyan OG |ఈ మధ్య కాలంలో ఏ నిర్మాణ సంస్థ కూడా అభిమానుకు ఇన్ని అప్డేట్స్ ఇవ్వలేదు. భారీ యాక్షన్ డ్రామాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
After a blazing Mumbai schedule, #OG has begun its second schedule in Hyderabad today. ⚡️#FireStormIsComing ?#TheyCallHimOG ?
— DVV Entertainment (@DVVMovies) May 18, 2023
Read Also: నాకు అలాంటి భర్తే కావాలి – హీరోయిన్ కృతి శెట్టి
Follow us on: Google News, Koo, Twitter