Pawan Kalyan OG |పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్న సినిమాల్లో యంగ్ డైరెక్టర్ సుజిత్ చేస్తున్న ఓజీ(OG) ఒకటి. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా యువ కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో తెలుగమ్మాయి, నటి శ్రియా రెడ్డి నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘పందెం కోడి’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో శ్రియా రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతకు ముందు ‘పొగరు’ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. తెలుగులో ‘అమ్మ చెప్పింది’, ‘అప్పుడప్పుడు’ సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో ‘ఓజీ'(Pawan Kalyan OG) సహా మిగతా సినిమా షూటింగులకు బ్రేక్ వస్తుందని కొందరు భావించారు. అయితే, అటువంటి సందేహాలకు పవన్ & దర్శక, నిర్మాతలు చెక్ పెట్టారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగులకు టైమ్ కేటాయిస్తానని పవన్ చెప్పడంతో ఏపీలో షూటింగులు జరగనున్నాయి. జూన్ తొలి వారంలో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులు షూటింగ్స్ చేశారు.