పవన్ పింక్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

పవన్ పింక్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు

0
108

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇక బీజేపీతో కలిసి ముందుకు వెళ్లనున్నారు, రాజకీయంగా ఇద్దరు కలిసి అడుగులు వేయనున్నారు.. ఈ సమయంలో పవన్ కల్యాణ్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.. ఎలాగో ఆయన పింక్ సినిమా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరి తాజాగా పవన్-దిల్ రాజు సినిమా విడుదలకు కూడా ముహుర్తం ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి… రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న పింక్ రీమేక్ ను విడుదల చేయడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ఈ నెల 20 వ తేది నుంచి పింక్ రీమేక్ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారట.

ఇక ఫ్రిబ్రవరి నుంచి పవన్ షూటింగ్ కు రానున్నారని తెలుస్తోంది. ఇక పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. సినిమాలో ఒక డ్యూయట్ , రెండు ఫైట్లు కూడా వుంటాయి అని తెలుస్తోంది, ఇక ఈ సినిమాలో ఇప్పటికే
నివేదా థామస్, అంజలి, అనన్య మూడు కీలక క్యారెక్టర్లకు ఎంపికయ్యారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తో కలిసి ఈ సినిమా దిల్ రాజ్ నిర్మించనున్నారు, ఇక పవన్ ఈ సినిమాపై ప్రకటన చేయడమే ఆలస్యం.