పృథ్వీరాజ్ తో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి షాకింగ్ డెసిషన్

పృథ్వీరాజ్ తో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి షాకింగ్ డెసిషన్

0
37

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న పృథ్వీరాజ్ చివరకు ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ సంభాషణ చేయడం, అది లీక్ కావడంతో, ఆయన పదవీ ఊడిపోయింది, అయితే దీనిపై విజిలెన్స్ కమిటీ విచారణ చేస్తున్నారు.. కాని సదరు ఉద్యోగిని ఎవరు అనేది బయటకు జనాలకు తెలియకపోయినా, అక్కడ ఉద్యోగులు అందరికి ఆమె తెలిసిన వ్యక్తే అని చెప్పుకోవాలి. వాయిస్ ప్రకారం అక్కడ వారు గుర్తుపడతారు.

అయితే తాజాగా దీనిపై ట్వీస్ట్ వచ్చింది. పృథ్వీపై ఆరోపణలు చేసిన బాధితురాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి విముఖత చూపడంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ ముందుకు సాగడంలేదని తెలుస్తోంది. దీంతో వారు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే తన పరువు పోయిందని ఫోన్ కాల్ రికార్డ్ చేసి బయటకు రావడంతో తను బాధపడుతోంది. తాను నలుగురిలో అల్లరిపాలు అయ్యాను అని బాధపడుతోందట సదరు ఉద్యోగిణి.

ఆమె మీడియా ముందుకు కూడా రావడానికి ఇష్టపడటం లేదు…దీంతో విజిలెన్స్ అధికారులు తమ దగ్గర ఉన్న టెలీఫోన్ సంభాషణ టేపులతోనే విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నేరుగా కంప్లైంట్ ఇవ్వకపోతే చర్యలు తీసుకునేందుకు ఎలాంటి అవకాశం ఉండదు అని కొందరు అంటున్నారు.