‘భీమ్లా నాయక్’ షూటింగ్​లో పవన్, రానా..ఫొటో వైరల్

Pawan, Rana in 'Bhimla Nayak' shooting..photo viral

0
115

పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది చిత్రబృందం. ఆఖరి పైట్​కు సంబంధించిన సన్నివేశంలా కనిపిస్తున్న ఈ ఫొటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్, రానా షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.

మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’​కు రీమేక్ గా  తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్ భార్యగా నిత్యామేనన్ కనిపించబోతుండగా..రానా సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంవత్సరంలో వకీల్ సాబ్ తో మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తోనే అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. అటు రానా అరణ్యతో వచ్చి నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో కనిపించడంతో అభిమానులు చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి భీమ్లా నాయక్ తో ఈ ఇద్దరు హీరోలు మెప్పిస్తారో లేదో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.