పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు వెను వెంటనే అనౌన్స్ చేస్తున్నారు… ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.. మరో రెండు సంవత్సరాల వరకూ పవన్ బిజీగానే ఉంటారు అని చెప్పాలి, ఇక వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ జరుగుతోంది ..తర్వాత ఆయన క్రిష్ తో ఓ సినిమా చేస్తారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో ఓ ప్రత్యేక పాత్ర ఉంది, ఆ పాత్ర కోసం ఓ హీరోయిన్ పేరు వినిపిస్తోంది, ఇందులో ఆమె పవన్ ప్రేమలో పడుతుందట.
ప్రేమించే హీరోయిన్గా ప్రణీత నటించబోతుందని టాలీవుడ్ టాక్ నడుస్తోంది, ఇక గతంలో పవన్ తో కలిసి ఆమె అత్తారింటికి దారేది చిత్రంలో నటించారు, మంచి గుర్తింపు వచ్చింది, ఇక తాజాగా పిరియాడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే చిత్రంలో మంచి పాత్ర కోసం ఆమెని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి, చూడాలి ఈ పాత్ర ఎవరు చేస్తారో.