‘సర్కారు వారి పాట’ నుండి పెన్ని సాంగ్ ప్రోమో రిలీజ్ (వీడియో)

0
44

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాను పరుశురాం తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ‘కళావతి..’ సాంగ్, అందులో మహేష్ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ  సినిమా నుంచి ఇవాళ సెకండ్ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు చిత్ర యూనిట్.తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పెన్నీ సాంగ్ ప్రోమో మాస్ బీట్ తో ఉంది. పెన్నీ పెన్నీ.. అంటూ ఈ పాట సాగనుంది. మనీ వ్యాల్యూ చెప్పేలా ఈ పాట ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పాటతో మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి మరో సర్‌ప్రయిజ్ ఇచ్చారు చిత్ర యూనిట్.

ఈ సాంగ్ లో మహేష్ కూతురు సితార ఘట్టమనేని కూడా కనిపించబోతుంది. పెన్నీ సాంగ్ ప్రోమోలో సితారని రివీల్ చేశారు. ఈ సాంగ్ లో స్పెషల్ ఎంట్రీ ఇవ్వనుంది సితార. సాంగ్ కు డ్యాన్స్ కూడా చేసింది. ఈ సాంగ్ తో సితార మొదటిసారి వెండితెరపై కనిపించనుంది. ఈ పూర్తి పాటని మార్చ్ 20 న విడుదల చేయనున్నారు.

సాంగ్ ప్రోమో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి