‘సర్కారు వారి పాట’ నుండి పెన్ని సాంగ్ రిలీజ్..అదరగొట్టిన మహేష్, సితార (వీడియో)

0
91

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాను పరుశురాం తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ‘కళావతి..’ సాంగ్, అందులో మహేష్ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ  సినిమా నుంచి ఇవాళ సెకండ్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పెన్నీ సాంగ్ ప్రోమో మాస్ బీట్ తో ఉంది. పెన్నీ పెన్నీ.. అంటూ ఈ పాట సాగనుంది. మనీ వ్యాల్యూ చెప్పేలా ఈ పాట ఉండబోతుంది. అయితే ఈ పాటతో మహేష్ అభిమానులకి, ప్రేక్షకులకి మరో సర్‌ప్రయిజ్ ఇచ్చారు చిత్ర యూనిట్.

ఈ సాంగ్ లో మహేష్ కూతురు సితార ఘట్టమనేని కూడా కనిపించబోతుంది. పెన్నీ సాంగ్ ప్రోమోలో సితారని రివీల్ చేసిన యూనిట్ సాంగ్ లో మహేష్ కళ్లజోడు పెట్టుకుని మెరిసిపోతున్నాడు. ఈ సాంగ్ తో సితార మొదటిసారి వెండితెరపై కనిపించనుంది.

సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=YeYTQau-2Js&feature=emb_title