పిల్లల ఆన్ లైన్ చదువులకోసం ఆవును అమ్మిన తండ్రి… మళ్లీ రంగంలోకి దిగిన సోనూ సూద్…

పిల్లల ఆన్ లైన్ చదువులకోసం ఆవును అమ్మిన తండ్రి... మళ్లీ రంగంలోకి దిగిన సోనూ సూద్...

0
107

చలన చిత్రంలో క్రూరమైన వేశాలు వేసి మోస్ట్ పవర్ ఫుల్ రౌడీగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ రియల్ లైఫ్ లో దేశ ప్రజలకు హీరో అయ్యాడు… కరోనా సమయంలో వలసవెళ్లిన వారికి వారి సొంత ఊరికి చేర్చి దేవుడు అయ్యాడు అలాగే విదేశాల్లో ఉన్నవారిని కూడా స్వదేశాలకి రప్పించారు..

ఇలా అనేక సేవలు అందిస్తూ మానవత్వాన్నిచాటుతున్నాడు సోనూసూద్… తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో కంగ్రా జిల్లా జ్వలా ముఖి చెందిన కులదీప్ కుమార్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కరోనా కారణంగా స్కూల్లల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.. దీంతో తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనాలని నిర్ణయించుకున్నారు…

అయితే అతని దగ్గర డబ్బులు లేవు.. అప్పు కూడా దొరకలేదు.. దీంతో ఆయన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఆవును అమ్మి స్మార్ట్ ఫోన్ కొన్నాడు.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఇక దీన్ని చూసిన సోనూసూద్ అతని డీటెల్స్ తనకు పంపమని కోరాడు…