ఆ స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే ?

0
200

టాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా ఉంది పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన అనేక సినిమాల్లో న‌టిస్తోంది. టాలీవుడ్ లో బాగా బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ పూజ‌. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‏లలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు కొత్త క‌థ‌లు కూడా వింటోంది.

ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చేసింది. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రాధే శ్యామ్ మూవీలోనూ నటిస్తోంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్‏గా ఎంపికైంది. ఇక తాజాగా మ‌రో వార్త వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ చాన్స్ అందుకున్నట్లుగా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ వార్త వైర‌ల్ అవుతోంది.

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించనుందట. ఈ చిత్రం తెలుగు త‌మిళ్ లో కూడా రానుంది. ఇందులో హీరోయిన్ గా ఆమెని ప‌రిశీలిస్తున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మేక‌ర్స్ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ చూడాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.