అతని దర్శకత్వం లో మరో సినిమా చెయ్యాలని ఉంది

అతని దర్శకత్వం లో మరో సినిమా చెయ్యాలని ఉంది

0
132

జూ.ఎన్టీఆర్ నటిస్తోన్న “అరవింద సమేత” సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో లవ్, ఫ్యాక్షనిజం, ఫ్యామిలీ మొదలగు సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, రావూ రమేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా బృందానికి ధన్యవాదాలు తెలియజేసింది పూజాహెగ్డే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాపై నమ్మకంతో నాకు ‘అరవింద’ పాత్రను ఇచ్చారు. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. అందుకే షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఆయనతో కలిసి మరోసారి పని చేయాలని వుంది. ఇక ఎన్టీఆర్ అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సెట్లో అందరితో కలివిడిగా వుంటారు. ఎలాంటి సీన్ అయినా ఒకటి రెండు టెక్స్ లోనే చేసేస్తారు. అదే ఆయనలోని గొప్పదనం. చినబాబు, వంశీ ఇద్దరూ కూడా చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.