‘RRR’ ట్రైలర్‌ అదరహో..ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు పూనకాలే

Poonakale for NTR and Ram Charan fans

0
113
RRR Trailer

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‏లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి. యుద్దాన్ని వెతుకుంటూ ఆయుధాలు అవే వస్తాయి అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ చరణ్, తారక్ విజువల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.

ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=NgBoMJy386M&feature=emb_title