‘నువ్వే నువ్వే’ @ 20.. ఈ సినిమాలోని పాపులర్ డైలాగ్స్ గుర్తున్నాయా?

-

తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమా నేటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 2002, అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఆయన డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాలోని ఈ డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట మాటలమధ్యలో వాడుతూనే ఉంటారు. మరి అంత పాపులారిటీ సంపాదించాయి ఈ డైలాగ్స్. ఇప్పుడు ఆ పాపులర్ డైలాగ్స్ అన్నిటినీ ఓసారి గుర్తు చేసుకుందామా..!!

- Advertisement -

‘అమ్మ, ఆవకాయ్, అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు.

డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చు పెట్టలేరు. ఖర్చుపెట్టే వాళ్లంతా ఆనందించారు.

తాజ్ మహల్… చార్మినార్… నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీరు సరిపోరు.

నేను దిగడం అంటూ మొదలు పెడితే.. ఇది మొదటి మెట్టు. దీన్నిబట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.

కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.

ఆడపిల్లలు.. పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకుని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.

డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమని కొనలేరు.

ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు… పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.

మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు.. మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు.

ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు… ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?

నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...