బ్లాక్ బాస్టర్ కాంబినేషన్..పవర్ స్టార్ ‘భవదీయుడు భగత్ సింగ్’ వచ్చేది అప్పుడే..!

power star 'Bhavadiyudu Bhagat Singh' was coming then ..!

0
111

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వీటిలో హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో రానున్న ‘భవదీయుడు భగత్ సింగ్​’ ఒకటి. పవన్​ నటిస్తున్న ‘భీమ్లానాయక్’​, ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలు పూర్తయ్యాక..హరీశ్​ సినిమా సెట్స్​పైకి వెళ్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్​ చేయనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లుగా రెగ్యులర్​ షూటింగ్​ను వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

అంతకుముందు హరీశ్​శంకర్​-పవన్​కల్యాణ్​ కాంబోలో వచ్చిన ‘గబ్బర్​సింగ్​’ సూపర్​హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ‘భవదీయుడు భగత్​సింగ్’​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుందని సమాచారం.