Adipurush | ‘పఠాన్’ రికార్డు బద్దలు కొట్టిన ‘ఆదిపురుష్’

-

ఆదిపురుష్(Adipurush) చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రావత్(Om Raut) దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమైంది. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు సరికొత్త చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతున్నది. ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠను, ఉత్సాహాన్ని నింపిన ఈ సినిమా విశేషాల్లోకి వెళితే.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను సుమారు రూ.500 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. రావణ సైన్యంతో వానర సేన జరిపే యుద్ధ పోరాటాలు తెర మీద అద్భుతంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
యుద్ధ సన్నివేశాలు సుమారు 40 నిమిషాలు కొత్త అనుభూతికి గురి చేస్తాయనే విషయాన్ని దర్శక, నిర్మాతలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా.. కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక థియేటర్లలో రిలీజవుతున్న చిత్రంగా ఘనతను సాధించింది. ఈ చిత్రం ఇటీవల రిలీజైన పఠాన్(Pathaan) సినిమా ప్రదర్శించిన థియేటర్ల రికార్డును అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లో 1100, తమిళనాడులో 170, కర్నాటకలో 180, కేరళలో 150, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 3300, ఓవర్సీస్‌లో 2100 థియేటర్లలో విడుదల చేశారు. మొత్తంగా దాదాపు 7000 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతేగాకుండా.. అడ్వాన్స్ బుకింగ్ పరంగానూ ఆదిపురుష్(Adipurush) సినిమా సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వసూళ్లను సాధించింది. హిందీలో రూ.13 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 50 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్‌కు చేరువైంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...