Adipurush Movie Review |ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది ‘ఆదిపురుష్’ చిత్రం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలమే కనబడుతోంది. జై శ్రీరామ్ నినాదాలతో సినిమా హాళ్లు మార్మోగిపోతున్నాయి. ఇక ఈ మూవీ టాక్ ఎలా ఉందనే అంశానికి వస్తే.. వాల్మీకి ఇతిహాసం గాథ రామాయణం గురించి తరతరాల నుంచి అందరికీ తెలిసిందే. అయితే అందులోని ప్రేమకావ్యం, బంధుత్వం, భావోద్వేగం ఎప్పటికీ చెరిగిపోని ఓ విజయకేతనం. దర్శకుడు ఓం రౌత్ ముఖ్యంగా ఆధునిక రామాయణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే నేటి తరానికి తగ్గట్లుగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి కధ, కథనాన్ని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా పాత్రల మధ్య ఉండాల్సిన భావోద్వేగాలు మర్చిపోయారు. దీంతో కొన్ని సీన్లు సాగదీతగా కనిపిస్తాయి. మొదటి భాగం రాఘవుడి వనవాసం, సీతారాముడి హృదయ కావ్యం, సోదరుడు శేషుతో కలిసి సత్యం, ధర్మం కోసమే అన్నట్లు సాగుతుంది. జానకిని అపహరించుకుపోయిన లంకేశ్వురుడిని రాఘవ ఎలా ఓడించాడు. తన జానకిని తిరిగి తీసుకొచ్చేందుకు ఏం చేశాడు? ఈ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచిందన్నది మిగతా కథగా తెరకెక్కింది.
Adipurush Movie Review |బంగారు లేడీ మాయ, సీతాపహరణం, వాలి-సుగ్రీవుల యుద్ధం, హనుమంతుడి సాయం, లంకాదహనం, రామసేతు నిర్మాణం, లక్ష్మణుడి ప్రాణాల్ని కాపాడటం కోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, రావణుడితో యుద్ధం లాంటి ఘట్టాలతో సినిమా సాగుతుంది. కథ కంటే కూడా విజువల్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు దర్శకుడు. అయితే విజువల్స్‌పై మరీ ఎక్కువగా దృష్టిపెట్టిన దర్శకుడు… భావోద్వేగాల్ని మాత్రం పట్టించుకోలేదు. యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినా అందులోనూ విజువల్సే తప్ప మిగిలిన అంశాలేవీ ఆకట్టుకోలేకపోయాయి.
రాఘవ పాత్రలో ప్రభాస్ జీవించారు. శ్రీరాముడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. జానకి పాత్రలో కృతిసనన్ చాలా హుందాగా, అందంగా కనిపించారు. లంకేశ్‌గా రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ ఒదిగిపోయాడు. క్లైమాక్స్‌లో సైఫ్ అలీఖాన్ నటన ఆకట్టుకుంటుంది. లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్ చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉంది. ఇక అజయ్- అతుల్ అందించిన పాటలు ఎంత బాగున్నాయో.. సంచిత్, అంకిత్ అందించిన నేపథ్య సంగీతం కూడా కట్టిపడేసింది.
*** మొత్తానికి ‘ఆదిపురుష్’ చిత్రం నేటి కాలానికి సరిపోయే ఆధునిక రామాయణం.
Read Also:
1. భారీగా పారితోషికం తీసుకున్న యాక్టర్స్ వీళ్లే!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat