ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ హీరో అతనే ..

ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ హీరో అతనే ..

0
86

బాహుబలి మూవీ తర్వాత వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు .ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ తో తీస్తున్న ఆదిపురుష్ ఒక పాన్ ఇండియా చిత్రం అన్న విషయం అందరికి తెలిసిందే .. అయితే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ స్టార్ రేసులో కన్నడ హీరో యష్ ఉన్నారు .

కెజిఫ్ మూవీ తో దేశం మొత్తాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేల చేసాడు . ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన యష్ అతితక్కువ కాలం లోనే పాన్ ఇండియా స్టార్ గ ఎదిగాడు . కెజిఫ్ మూవీ సృష్టించిన రికార్డులన్నిటినీ చాప్టర్ -2 తిరగరాస్తుందని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు . బాలీవుడ్ బాద్షా సంజయ్ దత్ ఈ మూవీ లో నటిస్తుండటం తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి .

అయితే కెజిఫ్ మూవీ రానంతవరకు కన్నడకు మాత్రమే పరిమితమైన యష్ ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు . ఒక కన్నడ హీరో గొప్పతనాన్ని వివరిస్తూ బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయంటే అయన రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు .