బాలీవుడ్ ఖాన్ లని ప్రభాస్ మించిపోనున్నాడా?

బాలీవుడ్ ఖాన్ లని ప్రభాస్ మించిపోనున్నాడా?

0
98

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. మొన్న జపాన్ నుండి ప్రభాస్ ని కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ రేంజ్ ఏ లెవెల్ లో ఉందో! అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం “సాహో”. సాహో చిత్రం ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి ద్వారా ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని రూపుదిద్దారు.

సాహో సినిమాని ఆగస్టు ౩౦ న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మొన్న సాహో ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఉన్న ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఒకే సారి నాలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్ పై చూడని యాక్షన్ సన్నివేశాల్ని చూడబోతున్నామని స్పష్టంగా అర్థం అవుతుంది.

బాహుబలి తర్వాత ఇండియాలో వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాహో ని చూస్తున్నారు. బాహుబలి ద్వారా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ప్రభాస్ సాహో తో బాహుబలిని అందుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్ కి చెందిన ప్రభాస్ బాహుబలి ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. బాలీవుడ్ ఖాన్ త్రయం మైమరిచిపోయేలా తన సత్తా ఏంటో చూపాడు.

అయితే “సాహో” ద్వారా మరోసారి హిందీలోకి అడుగుపెడుతున్న ప్రభాస్ బాలీవుడ్ ఖాన్ లని మించిపోతాడా అనే ప్రశ్న మొదలైంది. ప్రభాస్ ని ఈ ప్రశ్న అడగగా ఆయన దానికి వాళ్ళు ఆల్రెడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టారు. వాళ్ళని నేను మించిపోవాలని లేదు. ఈ సినిమా నా అభిమానులని ఎంటర్ టైన్ చేసి, నా ప్రొడ్యూసర్లకి డబ్బులు వస్తే చాలు అంతకు మించి ఇంకెలాంటి ఆశలు లేవని చాలా హంబుల్ గా సమాధానం ఇచ్చాడు.