కేసీఆర్‌ లో ఇన్ని కోణాలు ఉన్నాయా..? షాక్‌ లో గ్రేట్ డైరెక్టర్..?

కేసీఆర్‌ లో ఇన్ని కోణాలు ఉన్నాయా..? షాక్‌ లో గ్రేట్ డైరెక్టర్..?

0
40
KCR visits Kondagattu

కేసీఆర్.. జనం నాడి తెలిసిన నాయకుడు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సాధకుడు.. దశాబ్దాలుగా ఎవరూ సాధించలేని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపాడు.. ఇదీ అందరికీ తెలిసిందే.. ఇప్పుడు సీఎం అయ్యాక.. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తూ అపర భగీరధుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు.. ఇదీ అందరికీ తెలిసిందే.

కానీ కేసీఆర్ చాలా మందికి తెలియని కోణాలు ఉన్నాయి.. ఆయన ఓ చక్కటి సాహిత్యాభిలాషి.. ఆయన తెలుగు సాహిత్యం అంటే చక్కటి మక్కువ. ఆయన డిగ్రీలో చదవుకున్నది కూడా తెలుగు సాహిత్యమే. అందుకే ఆయన నోట అలవోకగా సామెతలు, పద్యాలు జాలువారుతుంటాయి. ఆయన వాగ్దాటికి కూడా కారణం అదే.

కేసీఆర్ లోని ఈ సాహిత్యం కోణం చాలా మందికి తెలియదు. తాజాగా దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ కూడా ఈ విషయంలో ఆశ్చర్యపోయారట. కేసీఆర్ తన ఇంటికి వచ్చినప్పుడు దాదాపు గంటసేపు పైగా సాహిత్యం విషయంలో చర్చ జరిగిందట.. ఈ సందర్భంగా కే విశ్వనాథ్ కేసీఆర్ ను మెచ్చుకున్నారు.

‘మీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుంది. ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారు. మీరు చక్కగా మాట్లాడతారు. మంచి కళాభిమాని కూడా” అంటూ విశ్వనాథ్ సిఎంను అభినందించారు. సాహిత్యాభిలాష ఎలా పుట్టిందని విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు, చిన్నప్పటి నుంచి తన గురువుల సాంగత్యం గురించి కేసీఆర్ వివరించారు. కేసీఆర్ సాహిత్యాభిలాషను అభినందించిన విశ్వనాథ్.. కేసీఆర్ సర్కారు పనులను కూడా మెచ్చుకున్నారు.

మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరుగా చూడడం ఇదే మొదటి సారి. చాలా సంతోషంగా ఉంది. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటి వారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉందని విశ్వనాథ్ కేసీఆర్ తో అన్నారు.