ప్రభాస్ సినిమా టైటిల్ దిల్ రాజు తీసుకుంటున్నారట

ప్రభాస్ సినిమా టైటిల్ దిల్ రాజు తీసుకుంటున్నారట

0
88

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం అంటే వెంటనే జాన్ అని అందరూ చెబుతారు.. పైగా టాలీవుడ్ అంతా జాన్ అన్ టైటిల్ అనే వార్తలు వస్తున్నాయి, మరి ఇంత బజ్ వచ్చింది కాబట్టి ..దీనికి కచ్చితంగా అదే పేరు ఫైనల్ చేస్తారు అని మరో టాక్ వినిపిస్తోంది.

కాని తాజాగా ఈ టైటిల్ మారిపోయేలా ఉందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ టైటిల్ ను మరో సినిమాకు ఇవ్వమని యూవీ క్రియేషన్స్ వారిని కోరుతున్నారట. అయితే దిల్ రాజు ఈ టైటిల్ ఏ సినిమాకి వాడుతారు అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి. కాని దీనిపై వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే తమిళ 96 సినిమా రీ మేక్ చేస్తున్నారు ఈ సినిమాని తెలుగులో జాన్ అనే టైటిల్ పెడదాము అని భావిస్తున్నారట
శర్వానంద్-సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగులో నేటివిటీకి తగ్గట్టు కొంత మార్పుచేర్పులు చేశారట. హీరోయిన్ పేరు జాను అందుకే ఈ టైటిల్ తీసుకోవాలి అని చూస్తున్నారట.