ప్రభాస్ తాజాగా ఓ సినిమా పూర్తి చేస్తున్నారు… అది ఆయన కెరియర్ లో 20వ సినిమా, ఇక కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించకముందే జార్జియా షెడ్యూల్ను పూర్తి చేసుకుని ఇండియా చేరుకున్న ప్రభాస్ టీమ్, తర్వాత షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోంది.
అయితే ఇక్కడ నుంచి ఇటలీ వెళ్లి అక్కడ షూటింగ్ ప్లాన్ చేశారు, కాని కరోనా ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంది, అందుకే చిత్ర యూనిట్ అక్కడ ప్లాన్ ఆపుకుంది, ఇక హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ వేసి చేయనున్నారట.
ఇప్పటికే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్స్ వేశారు. ఇప్పుడు మరో హాస్పిటల్ సెట్ను కూడా వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది..ఈ చిత్రాన్ని జిల్ పేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు, త్వరలోనే ఈ చిత్ర టైటిల్ రివీల్ చేయనున్నారు.