పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి, సాహో తర్వాత భారీ అంచానాలతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రచార చిత్రాలు మరిన్ని అంచనాల్ని పెంచాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘రాధేశ్యామ్’ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథ ఏంటంటే?
విక్రమాదిత్య (ప్రభాస్) వరల్డ్ ఫేమస్ అస్ట్రాలజర్. హస్తసాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే చెప్పి.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లిపోతాడు. తన చేతిలో ప్రేమ రేఖలు లేవని, లవ్‌ని కాకుండా ఫ్లటేషన్‌షిప్‌ని నమ్ముకుంటాడు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయితో ఎంజాయ్ చేసే విక్రమాదిత్య.. డాక్టర్ ప్రేరణ(పూజా హెగ్డే)తో మాత్రం తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ తన చేతిలో లవ్ లైన్స్ లేవని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేక పోతాడు. మరోవైపు ప్రేరణ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె రెండు నెలల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యులు చెప్తారు. కానీ తాను జీవితాంతం బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఈ జంట ప్రేమ సక్సెస్ అవుతుందా? విక్రమాదిత్య జీవితంలో ఏం తెలుసుకున్నాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే?
ప్రభాస్ పూర్తిస్థాయి లవర్ రోల్ చేసిన సినిమా ఇది. పామిస్ట్ గా బెస్ట్ యాటిట్యూడ్ చూపించారు ప్రభాస్. డాక్టర్ క్యారెక్టర్, నేచర్‌ని ఇష్టపడే అమ్మాయిగా పూజా హెగ్డే లుక్స్ ఫిదా చేస్తాయి. భాగ్యశ్రీ నృత్యం చేసే తీరు, జగపతిబాబు యాటిట్యూడ్, కృష్ణంరాజు పెద్దరికం.. ఏ ఫ్రేమ్‌కి ఆ ఫ్రేమ్ బావుంది. ముఖ్యంగా సినిమాను తీసిన లొకేషన్లు, కెమెరా యాంగిల్స్, సెలక్ట్ చేసుకున్న థీమ్, గ్రాఫిక్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో షిప్ సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్స్ట్ ఆసమ్ అనిపించాయి. ఏ శాస్త్రం 100 శాతం నిజం కాదు.. 99 శాతమే నిజం… దాన్ని జయించిన ఒక్క శాతం మందే ప్రపంచాన్ని శాసించి, చరితార్థులుగా మిగులుతారనే కాన్సెప్ట్ ని కూడా అందంగా చెప్పారు. చేతుల్లో ఏం ఉన్నా, లేకపోయినా, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే చేతల్లో చేయలేనిది ఏదీ ఉండదనే విషయాన్ని కూడా పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు.
బలాలు:
ప్రభాస్, పూజాహెగ్డే
విజువల్స్
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రెండు పాటలు
బలహీనతలు:
స్లో నేరేషన్
ఫైట్స్ లేకపోవడం
డైలాగ్స్ పేలకపోవడం