వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం..బరిలోకి మాజీ స్పీకర్ కోడెల కుమారుడు

0
36

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరగనుంది. ఎందుకంటే ఈ సారి పోటీకి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపైనా శివరామ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సారి వచ్చే ఎన్నికల్లో పోటీపై శివరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానని మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తనయుడు డాక్టర్ శివరాం సంచలన ప్రకటన చేశారు. వెంట ఉన్న కార్యకర్తలను తన ఇంటి మనుషులుగా చూసుకోవడం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని వివరించారు. ఇప్పటికే ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. దివంగత నేత కోడెల శివప్రసాద్ చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూ.. వెంట ఉన్న అనుచరులకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు.

నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గంలో గ్రామగ్రామాన కోడెల శివప్రసాద్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీన ఆయన జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నేతలను హెచ్చరించారు. సత్తెనపల్లిలో చేపట్టే పార్టీ కార్యక్రమాలు పార్టీ సొంత కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి మాత్రమే నిర్వహించాలని వారు సూచించారు.

మీడియా సమావేశాలు పార్టీ ఇతర సమీక్షలు సైతం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భవనంలోనే నిర్వహించాలని వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకారం నియోజకవర్గానికి ఒకే పార్టీ ఆఫీసు ఉండాలని… కార్యక్రమాలు అక్కడి నుంచి నిర్వహించాలని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు తెలియజేశారు. కాగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ 2014లో తన సొంత ఊరు అయిన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.