Kalki | ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి ట్రీట్.. ‘కల్కి’ రిలీజ్ డేట్ లాక్..

-

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులకు సంక్రాంతి ట్రీట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “KALKI-2898 AD” చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని అశ్వినిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో వైజయంతి బ్యానర్‌లో వచ్చిన జగదేక వీరడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9వ తేదినే విడుదలై ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. దీంతో ఇదే సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని(Kalki) కూడా విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఇక సినిమా విషయానికొస్తే పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమిత్ బచ్చన్(Amitabh Bachchan), లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకొనే(Deepika Padukone), దిశా పటాని(Disha Patani) తదితరులు నటిస్తున్నారు. మహాభారం ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదిరిపోయే గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉండనున్నారని చెబుతున్నారు. గతంలో విడుదలైన గ్లింప్స్ వీడియో చూస్తే విజువల్స్ ఏ మేరకు ఉంటాయో అర్థమవుతోంది. కాగా ఇటీవల విడుదలైన ‘సలార్’ బ్లాక్‌బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్మురేపింది.

Read Also: థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేసిన మహేష్ బాబు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...