రాజీనామాపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prakash Raj interesting comments on resignation

0
90

‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని నటుడు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారాయన. ‘మాకు (ప్యానెల్‌) మద్దతుగా నిలిచిన ‘మా’ సభ్యులకు నమస్కారం. నేను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉంది. మిమ్మల్ని మేం నిరాశ పరచం. త్వరలోనే అన్నింటినీ వివరిస్తా’ అని పేర్కొన్నారు.

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. ఆ వెంటనే ‘అధ్యక్షుడిగా నేను ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాని అంగీకరించను’ అని విష్ణు స్పష్టం చేశారు.