ఫ్లాష్..ఫ్లాష్- ‘మా’ ఎన్నికలపై ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు

Prakash Raj sensational allegations on 'our' election

0
112

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా మా వాళ్ళను ఓ రౌడీ బెదిరించారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్ కి ఓట్లు వేశారని చెప్పారు. ‘మా’ సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్ లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా మా ఎన్నికలో విష్ణు అధ్యక్ష పీఠం కైవసం చేసుకోగా ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీనితో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులు రాజీనామా కూడా చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయినా కానీ మా లో హీట్ ఇంకా తగ్గడం లేదు.