“నాటు- నాటు’ పాటకు ప్రధాని మోడీ, యోగి అదిరిపోయే స్టెప్పులు..వీడియో వైరల్

0
113

సర్వత్రా ఆసక్తి రేకేతించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా…ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనూహ్య సీట్లను సాధించింది. 403 సీట్లకుగాను ఏకంగా భారతీయ జనతా పార్టీ 255 సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.

అటు  సమాజ్ వాది పార్టీ కేవలం 111 సీట్లు మాత్రమే పరిమితమైoది. కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీలు ఉత్తరప్రదేశ్లో గల్లంతయ్యాయి. అయితే ఉత్తరప్రదేశ్లో అఖండ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ కంటే యోగి పైనే ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు సీఎం యోగి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేసిన వీడియో వైరల్ గా మారింది.

బీజేపీకి చెందిన సోషల్ మీడియా బృందం ఈ వీడియోను క్రియేట్ చేసి వదిలింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనిని టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. సినిమా లెవెల్ ఎక్కడికి వెళ్లింది అంటూ ప్రశ్నించారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/harish2you