ఒక్క సూపర్ హిట్ సినిమా వస్తే చాలు. ఆ దర్శకుడికి హీరోకి హీరోయిన్ కి వరుసగా అవకాశాలు వస్తాయి అనేది తెలిసిందే… బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇది కామన్… ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు వెను వెంటనే సూపర్ హిట్ సినిమాలు అగ్రహీరోలకి అందిస్తున్నారు. వారు చెప్పే కథ నచ్చడంతో హీరోలు సినిమాలు చేసేందుకు అంగీకారం చెబుతున్నారు.
ఇప్పుడు సర్కారివారి పాట సినిమాని మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో చేస్తున్నారు,
గీత గోవిందం ఫేమ్ పరశురామ్ గతంలో మహేష్ కి ఓ సినిమా కథ చెప్పారు ఇది నచ్చడంతో మహేష్ సినిమా చేస్తున్నారు..
ఇక తాజాగా ప్రిన్స్ మహేష్ మరో సినిమాని కూడా ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ హీరోగా భీష్మ సూపర్ హిట్ చిత్రాన్ని తీశారు, ఈ సినిమా హిట్ తో ఉన్న ఆయన తాజాగా మహేష్ క ఓ కథ చెప్పారు, ఇది నచ్చడంతో ప్రిన్స్ తర్వాత సినిమా ఆయనతో చేయనున్నారు అని తెలుస్తోంది. సో దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.