మరో సారి ట్రేండింగ్ లో కి ప్రియా ప్రకాష్

మరో సారి ట్రేండింగ్ లో కి ప్రియా ప్రకాష్

0
70

ఇంతకముందు కన్ను కొట్టి పాపులర్ అయిన ప్రియా వారియర్ మళ్లీ సందడి చేస్తోంది. ఆమె తొలి చిత్రం ‘ఒరు ఆడార్ లవ్’లోని మరో పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ట్రెండింగ్‌లో సాగుతున్న ఈ పాటపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇదివరకు విడుదల చేసిన ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలో ఆకట్టుకునే ప్రేమ సన్నివేశాలు, ముఖ్యంగా ప్రియ కొంటెగా కన్నుగీటిన సీన్ యువతను పిచ్చివాళ్లను చేశాయి.

అయితే తాజా ‘ఫ్రీక్ పెన్నె’ పాటలో అలాంటివేమీ కనిపించలేదు. వెస్టర్న్ మ్యూజిక్, గందరగోళం, కుప్పిగంతులతో నింపేశారు. ప్రియ తన ప్రియుణ్ని ముద్దు పెట్టుకునే సీన్ కూడా అంతగా పండలేదు. అయినా ఈ పట 14 లక్షల వ్యూస్ సాధించింది.