మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలలా హైప్ క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ ఎన్నికలు ముగియడంతో ఇక నరేష్ ప్యానల్ ఆనందంలో ఉన్నారు.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్‌కి నటీనటులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాలో ఓటు హక్కు గల సభ్యులు 745 మంది ఉండగా, కేవలం 473 ఓట్లు పోలైనట్టు తెలియచేశారు. అంటే 60 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అనే చెప్పాలి. యువ హీరోలు హీరోయిన్ల జాడ కూడా కనిపించలేదు. సీనియర్ హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ కనిపించారు.
ముఖ్యంగా గత కొద్ది రోజులుగా . అధ్యక్ష పదవికి పోటీపడిన శివాజీరాజా, వీకే నరేశ్… ఇరువురి ప్యానెల్ సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ఇక తెలుగులో అగ్రనటులుగా పేరు గాంచిన వారి ఇంటికి వెళ్లి ఎవరికి వారు సపోర్ట్ అడిగారు ..తొలి ఓటును వీకే నరేశ్ వేయగా… చివరి ఓటును హాస్యనటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుతున్న విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఇంత మంది టాప్ తెలుగు హీరోయిన్లు ఉన్నా కేవలం ప్రియమణి ఒక్కరే వచ్చి ఓటు వేశారు. మిగిలిన తెలుగు భామలు ఎవరూ ఓటు వేయలేదు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.