ఏపీలో తాజా సర్వే షాక్ లో మూడు పార్టీలు

ఏపీలో తాజా సర్వే షాక్ లో మూడు పార్టీలు

0
87

ఏపీలో ఎన్నికల బేరీ మోగింది.ఈ సమయంలో ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దం అయ్యాయి…ఇక ఒకరిపై మరొకరు దుమ్మెత్తుకుపోసుకునే స్టేజ్ పోయింది అని చెప్పాలి .ఇక ఆయా పార్టీలు ఎటువంటి సేవ ప్రజలకు చేయనున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీ మేనిఫెస్టో ఏమిటి? వైసీపీ జనసేన పార్టీలు ఎలాంటి తాయిలాలు ప్రజలకు ఇస్తాయి అనేది చూడాలి. ఇక ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం రాజకీయ పార్టీల నుంచి ఇప్పుడు ప్రజల చేతిరాతలోకి మారింది. ఈ రెండు నెలలు ఎన్నికల హీట్ ఉండనుంది.

అయితే ఈ సమయంలో సర్వేలు కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి, తాజాగా ఈ నేపథ్యంలో ఓ జాతీయ దినపత్రిక తాజాగా ఓ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం… టీడీపీ ప్రభుత్వ పాలన సంతృప్తికరంగా ఉందని 52.7 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారట. అదే సమయంలో టీడీపీ పాలనపై 47.3 శాతం మంది పెదవి విరిచినట్లు సర్వే పేర్కొంది. అయితే వైసీపీ గురించి కూడా ఈ సర్వే సంస్ద దృష్టిలో ప్రతిపక్ష పాత్ర బాగా చేయలేదు అని విమర్శ వచ్చింది.. ఇక గత ఏడాది నుంచి చంద్రబాబు పాలనపై బాగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని సర్వేలో తెలియచేశారు.

సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి పెంపు, ఫించను పెంపు అంశాలు టీడీపీపై సానుకూలతను పెంచాయని సర్వే స్పష్టం చేసింది.. ఇది మార్చి 2 నుంచి 8వ తేదీలోపు జరిగిన సర్వేగా ఆ మీడియా సంస్థ పేర్కొంది. అయితే హంగ్ వస్తే వైసీపీకి జనసేన సపోర్ట్ కంటే, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ప్రజలు ఈ సర్వేలో తెలియచేశారట.