Yashoda: సమంత ఓకే అంటే.. సీక్వెల్‌కు మేము రెడీ

-

producer praises samantha in Yashoda movie success meet: సమంత లేడీ ఓరియంటెడ్‌గా వచ్చిన యశోద సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది. దీంతో సక్సెస్‌ మీట్‌ నిర్వహించిన చిత్రబృందం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్లినా.. అందరి నుంచి యశోద సీక్వెల్‌పై తమను అడుగుతున్నారని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. ఈ సందర్భంగా దర్శకులు హరి, హరీష్‌ మాట్లాడుతూ, యశోద 2 విషయంలో తమకు ఒక ఐడియా ఉందని అన్నారు.

- Advertisement -

సెకండ్‌ పార్ట్‌, థర్డ్‌ పార్ట్‌కు లీడ్‌ కూడా ఉందని అన్నారు. కానీ ఇదంతా సమంత (Yashoda)పై ఆధారపడి ఉందన్నారు. సమంత ఓకే అంటే సీక్వెల్‌ తీసేందుకు తాము సిద్ధమని దర్శకులు పేర్కొన్నారు. తెలుగులు తమకిదే తొలి సినిమా అని దర్శకులు హరి, హరీష్‌ తెలిపారు. అన్ని భాషల నుంచి వస్తున్న పాజిటివ్‌ టాక్‌ ఎంతో సంతోషాన్నిచినట్లు తెలిపారు. సమంత వన్‌ విమన్‌ షో యశోద అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ కితాబునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయనీ.. ఆవిడ మళ్లీ సూపర్‌ ఎనర్జీతో తిరిగి వస్తారని కృష్ణప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...