సినీ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దేశంలో చరిత్ర సృష్టించింది కేజీఎఫ్ సినిమా… బాహుబలి సినిమా తర్వాత దేశంలో ఆరేంజ్ లో విజయం నమోదు చేసుకుంది… ఇది మామూలు విషయంకాదు… కన్నడహీరో యశ్ ను స్టార్ హీరోగా స్టార్ డమ్ అందిస్తూ తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్…. ఇక ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించాడు…
2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మామూలు రచ్చచేయలేదు ఇరగదీసిందనే చెప్పాలి… అయితే డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ అధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది…
ఇక ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ కూడా కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయలేదట అందుకే కేజీఎఫ్ నిర్మాతలు గుర్రుగా ఉన్నారట…