ప్రతీ ఖాతాలో డబ్బులు వేస్తారట…

ప్రతీ ఖాతాలో డబ్బులు వేస్తారట...

0
34

2014 ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా మోడీ పోటీ చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే ప్రతీ ఒక్కరి అకౌంట్ లో నగదు బదిలీ చేస్తానని చెప్పారు… అంతేకాదు విదేశాల్లో ఉన్న నల్లదనాన్ని కూడా తీసుకువస్తానని తెలిపారు… అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు… ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాబోతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

ప్రధాని మోడీ ఈదేశాన్ని అర్థికంగా గాడీలో పెట్టడానికి దేశంలో అన్ని అణగారిక వర్గాలకు పేద వర్గాల ఖాతాలకు నేరుగా డబ్బులు వేస్తారని చెబుతున్నారు… దేశం మళ్లీ బతికి బట్టకట్డానికి బుతుకు బండి కదలడానికి 20 లక్షల కోట్లుతో అతిపెద్ద అర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే… కార్మిక, రైతు, పెదల గురించి ఎక్కువగా ప్రస్తావించారు… కరోనా కారణంతో అందరు ఇళ్లలోనే ఉండిపోయారు…

దీంతో ఎవరి చేతిలో పైసా ఆదాయం లేదు… ఓ విధంగా చెప్పాలంటే అర్థికంగా లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి… దీని అదిగమించి మల్లీ కరెన్సీ కళకళలాడాలంటే హెలికాప్టర్ మనీ ని తీసుకురావలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల క్రితం డిమాండ్ చేశారు అయితే ఇపుడు దానిని ప్రధాని మోడీ అమలు చేయబోతున్నారని అంటున్నారు..

పథకాల పేరిట నిధులు కేటాయిస్తే అసలైన లబ్ది దారులకు చేరడం కష్టం చేసినా రూపాయో అర్ధో తప్ప వారికి ఏమీ దక్కదు దీంతో నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము వేస్తే అర్థికంగా స్తోమత వస్తుందని అర్థిక చక్రం కూడా అట్డడుగు స్థాయి నుంచి కదిలేందుకు ఆస్కారం ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోందట…