టాలీవుడ్ రౌడీ హీరో, అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. మరోవైపు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ హ్యాష్ టాగ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఆగస్ట్ 25న రిలీజ్ అయింది.
ఈ సినిమాకు IMDB 10 కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ”సినిమా అనే కాదు ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని దర్శకనిర్మాత ఈ మేరకు తెలియజేసాడు.
మేము ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్రాన్ని చూడండి” అంటూ ఏ చిత్రబృందమైన తమ సినిమాని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ, నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు” అని తమ్మారెడ్డి లైగర్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.