Flash News- పునీత్ రాజ్​ కుమార్ మరణం తట్టుకోలేక అభిమాని మృతి

Puneet could not bear the death of the fan

0
121

కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​ కుమార్ మరణం..సహ నటీనటులతో పాటు అభిమానులకు తీవ్రశోకాన్ని మిగిల్చింది. అయితే పునీత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయిన ఓ అభిమాని కూడా గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటకలోని మరూర్​ గ్రామానికి చెందిన మునియప్ప(28) రైతు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చిన అతడు..హీరో పునీత్​ రాజ్​కుమార్ మరణ వార్తను టీవీలో చూసి తట్టుకోలేకపోయాడు. షాక్​తో అక్కడికక్కడే గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను ప్రాణాలు వదిలేశాడు.

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను అటు సినీ పరిశ్రమతో పాటు..ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. తమ అభిమాన హీరోను కడసారి చూసుకునేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు..అభిమానులు బరువెక్కిన గుండెతో కన్నడ పవర్ స్టార్‏కు నివాళులు అర్పిస్తున్నారు.