లోకాన్ని చూడనున్న పునీత్..ఆ తర్వాతే అంత్యక్రియలు

Puneet will see the world..after that the funeral

0
96

గుండెపోటుతో కన్నమూసిన కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ అంత్యక్రియలు..శనివారం జరగనున్నాయి. ఆయన పార్ధివదేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచనున్నారు. తన తండ్రి, దిగ్గజ నటుడు రాజ్​కుమార్ సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు కూడా చేయనున్నారు. అయితే పునీత్ కుమార్తె వందితా రాజ్​ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరగనున్నాయి.

శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్​లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ విషయం తెలియగానే పలు భాషలకు చెందిన నటీనటులు.. సంతాపం వ్యక్తం చేశారు. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణంతో కర్ణాటకలో హైలర్ట్​ ప్రకటించారు. సినిమా థియేటర్ల మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

పునీత్​ రాజ్​కుమార్​ తన కళ్లను దానం చేశారు. ఆయన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. దిగ్గజ నటుడు డా.రాజ్​కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను వేరొకరికి దానం చేశారు.పునీత్​ కోరిక మేరకు.. ఆయన నేత్రాలను బెంగళూరులోని నారాయణ కంటి ఆస్పత్రికి అందజేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు పునీత్​ను కొనియాడుతున్నారు. భావోద్వేగంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.