Ismart Shankar |టాలీవుడ్‌లో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఉన్నారంటే.. అది పూరి జగన్నాథే అని అందరూ అంటుంటారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీసి భారీ నష్టాలను చనిచూశారు. అనంతరం కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. తాజాగా.. మరోసారి ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ఒక్క సినిమాతో అటు పూరి జగన్నాధ్, ఇటు రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. ఇక దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ సినిమాకి సీక్వెల్(Ismart Shankar) ప్రకటించాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. ఇందులో భాగంగా పూరి తన ట్విట్టర్‌లో అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన మే 14న సాయంత్రం 4 గంటలకి రానుందని ఈ వీడియోలో ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లు ప్రకటించాడు.