Pushpa 2 | ‘పుష్ప’గాడి మాస్ జాతర మొదలైంది.. అమ్మవారిగా అదరగొట్టిన బన్నీ..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ‘పుష్ప2(Pushpa 2)’ మూవీ యూనిట్ అదిరిపోయే న్యూస్ అందించింది. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్‌లో గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మవారిలా ఉగ్రరూపంతో చేస్తున్న ఫైట్‌ అదిరిపోయింది. మొత్తానికి టీజర్ మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. దీంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

ఈ మూవీలో జరిగే గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మోరు అవతారంలో నాట్యం చేయనున్నారట. అలాగే అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

Pushpa 2 | ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నాడు. వీరితో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీని రిలీజ్ చేయనున్నారు.

Read Also: కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....

Chinmoy Krishna Das | చిన్మోయ్ కృష్ణదాస్ కి బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ

ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) కి కోర్టులో...