దీపావ‌ళికి ‘పుష్ప’ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్..!

'Pushpa' Surprise Gift for Diwali ..!

0
93
Pushpa 2

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప’  సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా..భారీ బడ్జెట్‏తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత బన్నీ- సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండడంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్, మూడు సింగిల్స్ విడుదల అయ్యి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక‌ దీపావళికి మరో టీజర్ తో అభిమానులకు స్పెషట్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘పుష్ప’ టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్.

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రంలో పుష్ఫరాజ్‌ అనే స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ కాబోతోంది. మరి ఈ దీపావళి టీజర్ లోని ప్రత్యేకత ఏంటో మ‌రి కొద్ది రోజుల‌లో తేల‌నుంది.