పుష్ప:​ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ వచ్చేసింది..

0
134

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పాటలు విడుదలై ఆకట్టుకోగా తాజాగా ‘ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో పూర్తి మాస్ ​లుక్​లో కనిపిస్తున్న బన్నీ..సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో తీసిన ‘పుష్ప’లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్స్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఆ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. డిసెంబరు 17న ఈ సినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

https://www.youtube.com/watch?v=pHHig1XBML0&feature=emb_title