పుష్పలో అనసూయ రోల్ ఇదేనట ? టాలీవుడ్ టాక్

పుష్పలో అనసూయ రోల్ ఇదేనట ? టాలీవుడ్ టాక్

0
114

బుల్లితెరపై యాంకర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది అనసూయ… ఇక బుల్లితెరలో ఆమెకి తిరుగులేదు, ఇక వెండితెరపై కూడా రంగమ్మత్త అద్బుతమైన అవకాశాలతో బిజీగా ఉంది.. రంగస్ధలం సినిమాలో ఆమె పాత్ర ఎవరూ మర్చిపోలేరు….ఇక అనేక సినిమాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి, తాజాగా ఆమె సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప చిత్రంలో చేస్తున్నారు.

 

 

అయితే ఈ సినిమాలో అనసూయ ఓ కీలక రోల్ లో చేస్తున్నారట..ఈ సినిమాలో అనసూయది నెగెటివ్ రోల్ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది, అంతేకాదు ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ ఆమె చేస్తున్నారట

ఇక రంగమ్మత్తని మించిన రోల్ గా ఇది ఉంటుంది అని టాక్ నడుస్తోంది.

 

ఇక తాజాగా దీనికి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది, ఈ చిత్రంలో కమెడియన్ సునీల్కి భార్యగా నటిస్తుందని ఫిలిమ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. సీమకు చెందిన ఓ ప్రముఖ దంపతులుగా వీరు నటిస్తున్నారు అని టాక్, అయితే వీరిద్దరి రోల్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వెండి తెరపై సినిమా వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.