సునీల్ రియల్ స్టోరీ

సునీల్ రియల్ స్టోరీ

0
29

టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందారు సునీల్, ఓ పక్క కమెడియన్ గా చేస్తూ తర్వాత హీరోగా కూడా మారారు, అంతేకాదు ఆ తర్వాత మళ్లీ ప్రతినాయకుడి పాత్రలు చేస్తూ ఇప్పుడు కమెడియన్ గా హీరోగా ప్రతినాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజిగా ఉన్నారు సునీల్.

 

ఇందుకూరి సునీల్ వర్మ…ఫిబ్రవరి 28, 1973 న ఆయన భీమవరంలో జన్మించారు.. తండ్రి పోస్టల్ శాఖలో ఉద్యోగం చేసేవారు, ఆయన మరణించడంతో సునీల్ తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది, ఆయనని ఆమె చదివించారు.

 

సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్ఆర్ట్స్ కోర్సులో చేరారు సునీల్ . ఇక సినిమాలపై ఇంట్రస్ట్ తో ఆయన హైదరాబాద్ వచ్చారు… ఇక సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహం.

ఆయన భార్య పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశారు వీరికి ఓ పాప ఉన్నారు..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్సునీల్ మంచి స్నేహితులు… ఇక నటుడిగానే కాదు సునీల్ మంచి డ్యాన్సర్ . ఇక ఆయన కమెడియన్ గా చేస్తూ పలు సినిమాల్లో హీరోగా చేశారు.

 

అందాలరాముడు

మర్యాద రామన్న

పూల రంగడు,

మిస్టర్ పెళ్ళికొడుకు

తడాఖా,

భీమవరం బుల్లోడు

కృష్ణాష్టమి

జక్కన్న

ఈడు గోల్డ్ ఎహే

ఉంగరాల రాంబాబు

 

ఈ సినిమాల్లో హీరోగా నటించారు సునీల్

స్పెషల్ జ్యూరీ అవార్డు మర్యాద రామన్న చిత్రానికి వచ్చింది.

2003లో నువ్వు నేను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం

2006 లో ఆంధ్రుడు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు సునీల్