Film Chamber Elections | తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అగ్ర నిర్మాతలైన దిల్ రాజు ప్యానెల్, సి.కల్యాణ్ ప్యానెల్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ టెన్షన్‌గా మారింది. కాసేపట్లో ఎన్నికల తుది ఫలితాలు వెలువడనుండగా.. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నారాయణ మూర్తి కోరారు.
Film Chamber Elections | పండుగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ కావడంతో చిన్న సినిమా నిర్మాతలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కొద్ది మంది చేతుల్లోనే ఉందని అన్నారు. క్యూబ్ వల్ల నష్టాలు వస్తున్నాయని.. రేట్లను తగ్గించాలని విన్నవించారు. సగటు సినిమాలకు అవకాశం కల్పించి.. చిన్న నిర్మాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.