ప్రభాస్ “రాధేశ్యామ్” సినిమా విడుదల వాయిదా?

0
92

బాహుబలి, సాహో సినిమాల తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “రాధేశ్యామ్”. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కష్టమే అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై డైరెక్టర్ రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడనుందా అనే ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం ఇచ్చారు. సినిమా తీశాం..మిగతా వర్క్ నడుస్తుంది. మొత్తానికి సినిమా ముందే రెడీగా చేసి ఉంచుతాం. ఆ తరువాత నిర్ణయం నిర్మాతలదే అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి సంక్రాంతి బరిలో రాధేశ్యామ్ నిలుస్తుందా లేక మరో తేదీన వస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

కాగా “రాధేశ్యామ్” చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో ఇటీవలే కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయించారు. ప్రభాస్ “విక్రమాదిత్య” పాత్రలో, పూజా హెగ్డే “ప్రేరణ” పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.