‘రాధేశ్యామ్’ సినిమాలో ఆ సీన్స్ ఉండవు: డైరెక్టర్ రాధాకృష్ణ

Those scenes will not be in 'Radheshyam': Director Radhakrishna

0
34

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “రాధేశ్యామ్”. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.  ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కాగా “రాధేశ్యామ్” చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో ఇటీవలే కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయించారు. ప్రభాస్ “విక్రమాదిత్య” పాత్రలో, పూజా హెగ్డే “ప్రేరణ” పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను డైరెక్టర్ రాధాకృష్ణ వెల్లడించారు. ఈ సినిమాలో ఫైట్ ఉండకపోవచ్చు. కానీ ప్రేమ కోసం యుద్దాలు చేసే సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. మైండ్ నుండి హార్ట్ వరకు ప్రతి మనిషిలో జరిగే ఒక కథ ఇది. ఈ కథ ప్రభాస్ కు చెప్పగానే మనం చేస్తున్నాం డార్లింగ్ అన్నారు.