సీనియర్ హీరోతో నటించే బంపరాఫర్ కొట్టేసిన రాధికా

0
108

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తన నటనతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోయిన్ ల నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో నటించిన ఈ హీరో తాజాగా ఆచార్య మూవీలో నటించి విశేషప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల అయ్యి కలెక్షన్ ల సునామి సృష్టించింది.

అయితే చిరంజీవి నెక్స్ట్ ఏ సినిమా తీస్తాడని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాధికా కాంబో మల్లి రిపీట్ కాకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరు జంటగా నటించిన సినిమాలు రికార్డ్స్ క్రేయేట్ చేసాయి. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి మనముందుకు వస్తున్నారు.

కానీ ప్రస్తతం వీళ్లిద్దరు హీరో హీరోయిన్లు గా కాకుండా చిరంజీవి హీరోగా నటించే కొత్త చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించనున్నారు. తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రానికి చిరంజీవి హీరోగా ఓకే చెప్పినందుకు రాధికా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ విషయంపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, రాధికా కాంబో అంటే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.