ఎన్టీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ర‌ఘు

ఎన్టీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ర‌ఘు

0
76

హీరో ర‌వితేజ న‌టించిన కిక్ చిత్రంలో స్వామీజి పాత్ర‌లో జిల్ జిల్ జిగా జిగా అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన హాస్య‌న‌టుడు ర‌ఘూ ఒక ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ జూనియ‌ర్ నంద‌మూరి తార‌క‌రామారావుపై ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌ట‌పెట్టారు.

తాను ఐమ్యాక్స్ థియేట‌ర్ లో సినిమా చూసి వ‌స్తున్న స‌మ‌యంలో ఎస్టీఆర్ న‌టించిన చూడాల‌నివుంది చిత్రం షూటింగ్ జ‌రుగుతుంద‌ని ఆ స‌మ‌యంలో రాజీవ్ క‌న‌కాల ఎన్టీఆర్ కుప‌రిచ‌యం చేశార‌ని అప్ప‌టినుంచి త‌న‌ను ఎన్టీఆర్ అభిమానిస్తార‌ని అన్నారు. ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం ఆయ‌న త‌ల‌చుకోని రోజంటూ ఉండ‌ద‌ని ర‌ఘు అన్నారు. త‌న పిల్లలు కూడా ఎన్టీఆర్ కూ వీరాభిమానుల‌ను ఆయ‌న సినిమాలు ఏదైనా రిలీజ్ అయితే ఫ‌స్ట్ షోకే వెళ్తార‌ని ర‌ఘు అన్నాడు. అంతేకాదు త‌న పిల్లల పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తాన‌ని అప్పుడు త‌న పిల్ల‌ల‌ను ఎన్టీఆర్ ఎంతో ఆత్మీయంగా ప‌లుక‌రిస్తారి అన్నారు.