రాజ్ తరుణ్ సినిమాకి టైటిల్ ఖరారు

రాజ్ తరుణ్ సినిమాకి టైటిల్ ఖరారు

0
111

హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలోనే తన దూకుడు చూపించాడు. యువ కథానాయకులతో పోటీపడుతూ సినిమాలు చేశాడు. అయితే ఫలితాలు నిరాశపరుస్తూ ఉండడంతో కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు.

టీనేజ్ లవ్ స్టోరీకి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని ప్రాజెక్టులకు రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు విజయ్ కుమార్ కొండకు రాజ్ తరుణ్ ఒకే చెప్పేసాడు.

కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు ఉరేయ్ బుజ్జిగా అనే టైటిల్ ను ఈ సినిమాకు మంగళవారం ప్రకటించారు. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అను ప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.