Rajamouli | మహేష్‌బాబు చాలా అందగాడు.. జపాన్‌లో రాజమౌళి వ్యాఖ్యలు..

-

ప్రస్తుతం జపాన్ టూర్‌లో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli).. మహేష్‌బాబు(Mahesh Babu)తో తాను తీయబోయే చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా తర్వాత్రి చిత్రం మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కేవలం హీరోను మాత్రమే సెలక్ట్ చేశాం. అతడి పేరు మహేష్ బాబు.. మీలో చాలా మందికి ఆయన తెలుసు అనుకుంటా. మహేష్ చాలా అందగాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ టైమ్‌లో మహేష్‌ను ఇక్కడికి తీసుకువచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను” అంటూ చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.

- Advertisement -

కాగా అమెజాన్ అడవుల నేపథ్యంతో పాన్ వరల్డ్ రేంజ్‌లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరెకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. గుబురు గడ్డం, పొడవాటి జుట్టు పెంచుతున్నారు. ఈ ఏడాది షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీని 2025లో విడుదల చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Read Also: హిట్ కాంబో రిపీట్ చేస్తున్న నితిన్.. ఈసారి కూడా బ్లాక్‌ బస్టరేనా..!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...